Natu Natu Song: ఆ సినిమాలో ఈ పాట ఎలా సెట్‌ అవుతుందబ్బా!

వెబ్‌ బిరియానీలో… నాన్‌ వెజ్‌ ముక్క కనిపిస్తే ఎలా ఉంటుంది? ఏదో చిన్న ఇబ్బంది కలుగుతుంది. కార్తిక మాసంలో నాన్‌వెజ్ మాటలు ఎందుకు అంటారా. అయితే సేమియా పాయసంలో ఆవకాయ ముక్క తగిలితే… ఇది కూడా కష్టమే. అలా ఓ ఫ్లేవర్‌లో సాగిపోతున్న సినిమాలో అనూహ్యంగా వేరే కాన్సెప్ట్‌ వస్తే అంతే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త పాట చూసి నెటిజన్లు ఇదే మాట అంటున్నారు. ‘నాటు నాటు’ అంటూ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి ఓ పాట విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్‌ వీడియో అదరగొడుతోంది. ఆ పాటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లుక్‌, డ్యాన్స్‌ స్టెప్పులు, గ్రేస్‌, స్వాగ్‌… ఇలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఈ పాట ఎలా సెట్ అవుతుంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ పాట అనౌన్స్‌మెంట్‌ తర్వాత… ఎప్పుడు సినిమా మొదలైన తొలి రోజుల్లో వచ్చిన పుకారు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. జక్కన్న రెండు కాలాలను, రెండు జన్మలను, తరాలను కలిపేలా సినిమాలు రూపొందిస్తుంటారు.

ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను కూడా అలా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారా? ఈ మాట చాలా రోజుల క్రితమే సోషల్‌ మీడియాలో వినిపించింది. ఇప్పుడు వస్తున్న పాట ఆ మాటలకు జస్టిఫై చేసేలా ఉంది. చూడాలి. వచ్చే సంక్రాంతికి ఏ విషయం తెలిసిపోతుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus