Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?
- January 3, 2026 / 11:00 PM ISTByFilmy Focus Desk
‘డాన్’ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. రెండూ భారీ విజయాలే అందుకున్నాయి. 1978లో వచ్చిన తొలి ‘డాన్’లో అమితాబ్ బచ్చన్ అదరగొట్టగా.. 2006లో వచ్చిన ‘డాన్’లో షారుఖ్ ఖాన్ ఇరగదీశాడు. ఆ తర్వాత ‘డాన్ 2’ అంటూ 2011లో మరోసారి వచ్చి సేమ్ ఫీట్ కంటిన్యూ చేశాడు. అయితే మూడో ‘డాన్’ను తీసుకొద్దామని.. తానేమంటో చూపిద్దామని దర్శకుడు ఫరాన్ అక్తన్ చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఇదిగో, అదిగో అంటూ వార్తలు వస్తున్నాయి ఇంకా సినిమా ఓకే అవ్వడం లేదు.
Don 3
‘డాన్ 3’లో షారుఖ్ ఖాన్ బదులు వేరే హీరోను తీసుకుంటున్నారు అని తెలియగానే ‘డాన్’ ఫ్యాన్స్, షారుఖ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షారుఖ్‌ని కాదని వేరొకరిని ఎలా తీసుకుంటారు గగ్గోలు పెట్టారు. ఆ కారణమా, ఇంకో కారణమో కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సడీసప్పుడు లేదు. ఇప్పుడు కొత్త మాటలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరో మారిపోతున్నాడని టాక్. ఇప్పటికే వివిధ కారణాల వల్ల హీరోయిన్ కియారా అడ్వాణీ తప్పుకోగా.. ఇప్పుడు రణ్‌వీర్ కూడా తప్పుకుంటున్నాడట.

అంతేకాదు మధ్యలో సినిమాలోకి కీలక పాత్రధారిగా రావాల్సిన విక్రాంత్ మస్సే కూడా నో చెప్పేశాడు. ఆయన బదులు వేరే నటుడి కోసం ఫరాన్ అక్తర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలూ వస్తున్నాయి ఆ విషయం పక్కనపెడితే రణ్‌వీర్ బదులుగా హృతిక్ రోషన్‌ను తీసుకుంటున్నారు అని లేటెస్ట్ టాక్. ‘క్రిష్ 4’ చేస్తాడు అంటూ హృతిక్ గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మరి ఈ సినిమా ఓకే చేస్తాడా అనేది తేలాల్సిన విషయమే.

ఒకవేళ హృతిక్ ఓకే చేస్తే.. రణ్‌వీర్ సింగ్ పరిస్థితి ఈ గ్రీక్ గాడ్‌కి కూడా వస్తుందా అనేది డౌట్. ఎందుకంటే షారుఖ్ బదులు రణ్‌వీర్ అంటే విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. మరి హృతిక్‌కి ఆ ఇబ్బంద ఉంటుందా? ఇదంతా తేలాలంటే ఆయన నటిస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ రావాలి.












