సినిమా కథ చదవుతున్నప్పుడు చప్పట్లు కొట్టేశాం, ఈలలు వేసేశాం, కన్నీళ్లు పెట్టుకున్నాం అని హీరోలు చెబుతుంటే… కొంతమంది ‘అవునా నిజమా’ అని అంటుంటారు. ఎందుకంటే కథ వింటే అలా చేస్తారా అనే డౌట్ రావడమే కారణం. అయితే వాళ్లు నటులు కథ చెబుతున్నప్పుడే దానిని విజువలైజ్ చేసేస్తుంటారు. అందుకే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. అలా తాను కూడా ఓ సినిమా కథ వింటూ ఏడ్చేశాను అని చెప్పేశాడు స్టార్ హీరో.
అతనెవరో కాదు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఆయన అలా కన్నీళ్లు పెట్టుకున్న సినిమా‘కొయి మిల్ గయా’. హృతిక్ ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా… ఆ తర్వాత వరుస పరాజయాలు వచ్చాయి. దీంతో కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందా అనే సమయంలో ‘కొయి మిల్ గయా’ సినిమా వచ్చింది. మానసికంగా బలహీనంగా ఉన్న రోహిత్ మెహ్రా అనే యువకుడి పాత్రలో హృతిక్ రోషన్ ఆ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నాడు.
‘కొయి మిల్ గయా’ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హృతిక్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. రోహిత్ పాత్ర తాను చేయడానికి… నిజ జీవితంలోని ఎన్నో సంఘటనలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. పాఠశాలలో ఉన్నప్పుడు బెదిరింపులకు గురయ్యాని చెప్పిన హృతిక్… తనకు నత్తి ఉండటంతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాడినని చెప్పాడు. అలా రోహిత్ పాత్రకు కావాల్సిన చాలా విషయాలు తన జీవితమే తనకు ఇచ్చిందని చెప్పాడు.
అలాగే ‘కొయి మిల్ గయా’ స్క్రిప్ట్ చదువుతున్నంతసేపు ఏడ్చేశానని కూడా చెప్పాడు. ఆ స్క్రిప్ట్ చదవడానికి ఏడు గంటలు పట్టిందట. ప్రతి మూడు పేజీలకోసారి తనకు ఏడుపు వచ్చేసేదట. అంతేకాదు ఆ సినిమా కథ చాలా బాగుంటుందని, ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్భుతం అని పొగిడేశాడు హృతిక్. ఆ సినిమాత నకు జీవితంలో ఎన్నో నేర్పించిందని, నన్ను నేనుగా నిరూపించుకోవడానికి ఉపయోగపడిందని కూడా చెప్పాడు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!