ఎన్టీఆర్ కి మాత్రమే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చిన హృతిక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆగస్టులో రిలీజ్ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే.. ఎన్టీఆర్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఇది సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  సినిమాకి షిఫ్ట్ అవుదామని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

Jr NTR

ఎన్టీఆర్ లేని ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ షాట్స్ ను లాంగ్ షాట్స్ ను డూప్స్, బాడీ డబుల్స్ తో చేయించేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ కూడా కంప్లీట్ గా మార్చుకోవాల్సి ఉందట. అందుకే ‘వార్ 2’ లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి తొందరపడుతున్నాడట. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ వల్ల ఎన్టీఆర్ ప్లానింగ్ అప్సెట్ అయినట్లు తెలుస్తుంది.

ఎందుకంటే ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా హృతిక్ రోషన్ కు (Hrithik Roshan) లెగ్ ఇంజ్యూరీ అయ్యిందట. దీంతో హృతిక్ హాస్పిటల్ పాలయ్యాడు.అతన్ని 4 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో 4 వారాలు ‘వార్ 2 ‘ షూటింగ్ డిలే అవుతుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్- హృతిక్..ల కాంబినేషన్లో కొన్ని కీలక యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించాల్సి ఉందట. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ప్లాన్స్ అన్నీ అప్సెట్ అయినట్టు స్పష్టమవుతుంది.

సర్ ప్రైజ్ ఇచ్చిన SVSC సిస్టర్.. కాబోయే భర్తతో ఇలా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus