Vijay Devarakonda: విజయ్ సినిమాకి ‘హృదయం’ టెక్నీషియన్!

ఇతర భాషల్లో ఉన్న టాలెంటెడ్ టెక్నీషియన్స్ ను టాలీవుడ్ లోకి తీసుకొస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అందులోనూ సంగీతపరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే దర్శకులు.. దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీల మీద ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా తమిళ, మలయాళ ఇండస్ట్రీల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం ఎప్పటినుంచో జరుగుతోంది. గతంతో పోలిస్తే మలయాళం నుంచి తెలుగులోకి చాలా మంది సంగీత దర్శకులు వస్తున్నారు. గోపిసుందర్, జేక్స్ బిజోయ్, గోవింద్ వసంత వంటి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో కూడా సత్తా చాటారు.

Click Here To Watch NOW

ఇప్పుడు హేష‌మ్ అబ్దుల్ వాహ‌బ్ అనే మరో మంచి సంగీత దర్శకుడు తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది ‘హృదయం’ సినిమా. ఇందులో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన ప్రధాన పాత్రల్లో నటించారు. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’, ‘ప్రేమమ్’ తరహాలో సాగే లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడు హేష‌మ్ అబ్దుల్ వాహ‌బ్.

ఈ సినిమా రిలీజ్ తరువాత అతడి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తెలుగు నుంచి ఓ పేరున్న సినిమాకి అతడిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకి ‘ఖుషి’ అనేది వర్కింగ్ టైటిల్. ముందు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ ను అనుకున్నారు. కానీ ఫైనల్ గా హేష‌మ్ అబ్దుల్ వాహ‌బ్ ను ఎంపిక చేశారు. మరి ఈ సినిమాకి ఆయన ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus