మీడియం రేంజ్ హీరోల సినిమాల బడ్జెట్ గట్టిగా రూ.40 కోట్లు. అంతకు మించి పెట్టాల్సి వస్తుందంటే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోల సినిమాల డిజిటల్ రైట్స్ అంత ఈజీగా అమ్ముడుపోవడం లేదు. అందుకు చాలా షరతులు పెట్టి… అందులో క్వాలిఫై అయితేనే తీసుకుంటున్నాయి సదరు డిజిటల్ సంస్థలు. ఇది ఏమాత్రం పట్టించుకోకుండా కొంతమంది నిర్మాతలు మిడ్ రేంజ్ సినిమాలకి కూడా భారీ బడ్జెట్లు పెట్టేస్తున్నాయి.
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent) సినిమాకు రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు మన నిర్మాతలు ఎలా ఉన్నారు అనేది. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా రోహిత్ కె.పి. దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా మొదలైంది. ‘హనుమాన్’ (Hanu Man) నిర్మాత కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్ అవుతుందట.
‘విరూపాక్ష’ (Virupaksha) సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇక ‘హనుమాన్’ సినిమా అయితే రూ.350 కోట్లు కొల్లగొట్టింది. సో నిర్మాత, హీరో..లను బట్టి చూస్తే ఓకే. కానీ కొత్త దర్శకుడిని నమ్మి కూడా నిర్మాత అంత పెట్టేస్తుండటం రిస్క్ అనే చెప్పాలి. ఒకవేళ వర్కౌట్ అయితే 2 రకాలుగా ఆయనకు మంచి పేరు వస్తుంది.