తెలుగు చిత్ర పరిశ్రమకి వేసవి సెలవులు కీలకమైనవి. ఆ సెలవులను క్యాష్ చేసుకోవాలని ప్రతి నిర్మాతకు ఉంటుంది. కొంతమందికే ఆ సమయంలో రిలీజ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది వేసవి హంగామాను మార్చిలోనే మొదలు పెట్టేసారు. పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’, వెంకటేష్ ‘గురు’, పూరి ‘రోగ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ లో రిలీజ్ కావడానికి స్టార్ హీరోల చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ నెల 7న మణిరత్నం, కార్తీల ‘చెలియా’ రిలీజ్ కానుంది. ‘మిస్టర్’గా వరుణ్ తేజ్ ఏప్రిల్ 13నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ కి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’పై అందరి చూపు ఉంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 28 న థియేటర్లోకి రానుంది.
ఈ వేసవిలోనే అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’గా సందడి చేయబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గౌతమ్ నంద’ కూడా వేసవే లక్ష్యంగా ముస్తాబవుతోంది. ఇక తెలుగు, తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ 23 మూవీ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ స్టార్ సినిమాలతో పాటు యువ హీరోల చిత్రాలు దూసుకురాబోతున్నాయి. నాగచైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’, నిఖిల్ ‘కేశవ’, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’, శర్వానంద్ ‘రాధ’, సాయిధరమ్ తేజ్ ‘నక్షత్రం’ చిత్రాలు మేలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి విజయం ఎవరికీ వరిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.