Varun Tej Ghani Movie: మెగాహీరో సినిమాకి భారీ డీల్!

మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా కోసం బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు వరుణ్. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు కానీ సినిమాకి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడానికి ప్రముఖ ఛానెల్ ప్రయత్నిస్తోంది.

హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కలిపి మొత్తం రూ.23 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ను తీసుకోవడానికి చిత్రబృందం సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ముందుగా మీడియం బడ్జెట్ లో తీయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మేకింగ్ కోసం రూ.42 కోట్లు దాకా ఖర్చవవుతుందట. ఇందులో సగం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూపంలో వస్తున్నప్పటికీ మిగిలిన మొత్తాన్ని థియేట్రికల్ రైట్స్ ద్వారా రాబట్టాలి. రూ.20 కోట్లకు పైగా సినిమాను అమ్మగలిగితేనే నిర్మాతలకు లాభాలొస్తాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరగడమంటే మాములు విషయం కాదు. మరేం జరుగుతుందో చూడాలి. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus