ఈ మధ్య ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే సినిమాలు కరువైపోయాయి. ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా జనాలు థియేటర్లకు రావడం లేదు. రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ తో ఎంత హడావిడి చేసినా జనాలు థియేటర్లకు రావడం లేదు. సందీప్ కిషన్ (Sundeep Kishan) ‘మజాకా’ (Mazaka) , నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి సినిమాలకి మేకర్స్ చేసిన ప్రమోషన్ హై-లెవెల్లోనే ఉన్నాయి. కానీ అవి జనాలను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇలా మన హీరోల సినిమాలకే బుకింగ్స్ లేక 4 రోజులకే దుకాణం సర్దేస్తుంటే..
వేరే భాషల హీరోలు మాత్రం తమ సినిమాలతో జనాలను థియేటర్లకు రప్పించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వాళ్లలో ఒకరు తమిళ హీరో, ఇంకొకరు మలయాళ హీరో. ఆ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) అయితే మలయాళ హీరో నస్లేన్ కావడం కావడం విశేషం. ‘లవ్ టుడే’ (Love Today) సినిమాతో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ‘డ్రాగన్’ (Return of the Dragon) సినిమా అన్ సీజన్లో రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
బ్రేక్ ఈవెన్ సాధించింది. బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు. ఇక నస్లేన్ విషయానికి వస్తే ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. రాజమౌళి (S. S. Rajamouli) లాంటి దర్శకుడే ఆ సినిమాలో నస్లేన్ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ‘ప్రేమలు’ (Premalu) కూడా తెలుగు బయ్యర్స్ కి మంచి వసూళ్లు తెచ్చిపెట్టింది.
దీంతో తన నెక్స్ట్ సినిమా ‘జింఖానా’ ని (Alappuzha Gymkhana) కూడా తెలుగులోకి తీసుకొచ్చారు.ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం డ్రై సీజన్ నడుస్తున్నప్పటికీ… నిన్న కొన్ని చోట్ల 30 శాతం బుకింగ్స్ ను నమోదు చేసింది. మౌత్ టాక్ కూడా బాగా రావడంతో ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ బెటర్ అయ్యాయి. ప్రదీప్ బాటలోనే నస్లేన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు కూడా బుకింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది.