Kangana Ranaut: కంగనకి చీకట్లు మిగిల్చిన ‘ధాకడ్‌’… ఎంత నష్టమంటే?

  • May 30, 2022 / 05:07 PM IST

సినిమా విడుదలైన ఎనిమిదో రోజున కేవలం 20 టికెట్లు మాత్రమే తెగాయి అంటే ఏమనుకోవాలి… థియేటర్‌కి జనాలు రాలేదు అనుకోవాలి. ఆ ఏరియాలో ఆ సినిమా చూడటానికి ఎవరూ ఆసక్తికగా లేరు అనుకోవాలి. అయితే ఇదంతా ఒక థియేటర్‌లో 20 టికెట్లు తెగితే. కానీ ఇక్కడ ఆ టికెట్లు తెగింది ఒక్క థియేటర్‌లో కాదు, మొత్తంగా దేశంలో అంటే నమ్ముతారా? అవును ఇదే జరిగింది. ఇంతటి ఘనత సాధించిన ఆ చిత్రం పేరు ‘ధాకడ్‌’. అవును కంగన రనౌత్‌ కొత్త సినిమానే.

బాలీవుడ్‌లో ఖాన్స్‌, స్టార్‌ హీరోలు వరుసగా విజయాలు సాధిస్తున్న సమయంలో నేనేం తక్కువ కాను అంటూ మహిళా ప్రాధాన్య సినిమాలు చేస్తూ వచ్చింది కంగన. ఈ క్రమంలో రెండు భారీ విజయాలు దక్కడంతో ఇక నేనే లేడీ సూపర్‌స్టార్‌ అని తనకు తానే స్వయం ప్రకటన ఇచ్చేసుకుంది. బాలీవుడ్‌కి సరైన హిట్‌ లేక.. సతమతమవుతున్న సమయంలో ‘ధాకడ్‌’తో వచ్చి బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లాపడింది. రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ‘ధాకడ్‌’ మే 20న విడుదలైంది.

టీజర్‌, ట్రైలర్‌ చూసి బాలీవుడ్‌ జనాలు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్‌ ఇండియా సినిమాల ధాటికి దిగాలుగా మారిన ఫక్తు బాలీవుడ్ సినిమా ప్రపంచం… ‘ధాకడ్‌’ హిట్‌ అయితే బాలీవుడ్‌ ఈజ్‌ బ్యాక్‌ అందాం అనుకుంది. కానీ ‘ధాకడ్‌’ బాక్సాఫీసు దగ్గర వారం తిరిగే సరికి కేవలం 20 టికెట్లు మాత్రమే తెంపుకొని దారుణమైన పరాజయానికి నిదర్శనంగా నిలిచింది. మే 27న ‘ధాకడ్‌’కు దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట.

దీంతో ₹4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగిందట. ఈ సినిమా బడ్జెట్‌ ₹90 కోట్లు అని సమాచారం. ఇప్పటివరకు వసూలు చేసిన షేర్‌ ₹5 కోట్లలోపే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన నష్టం ₹85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ల జాబితాలో చేరింది అని చెప్పొచ్చు. కంగనా తనదైన రోజున ఎవడైనా కొడతాడు, కానీ తనది కాని రోజున కొట్టేవాడే హీరో. ఈ మాట చెప్పింది మేం కాదు ‘అరవిందసమేత’లో త్రివిక్రమ్‌. కాబట్టి అదన్నమాట మాట.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus