Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ లో చిరు- రవితేజ ల మధ్య భారీ ఫైట్?

గతేడాది ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఆ సినిమాలతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచారు. ‘ఆచార్య’ తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’ పర్వాలేదు అనిపించినప్పటికీ.. జనాలు మాత్రం థియేటర్ కు వెళ్లి ఈ సినిమాని చూడలేదు.సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నప్పటికీ ఈ మూవీ కోసం జనాలు ఎగబడింది లేదు. ఎందుకంటే ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన మలయాళం మూవీ ‘లూసిఫర్’ కు రీమేక్ కాబట్టి..!

అందులోనూ అది ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘వాల్తేరు వీరయ్య’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరు. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందిస్తారు అనే పేరున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మాతలు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇటీవల ‘ధమాకా’ తో బ్లాక్ బస్టర్ కొట్టి.. రవితేజ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది.

అతని పాత్రకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో చిరు పాత్రకు ధీటుగా రవితేజ పాత్ర ఉండబోతుందని ఆ టీజర్ స్పష్టం చేసింది. విక్రమ్ సాగర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా షాలిని అనే పాత్రలో కేథరిన్ కనిపించబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో రవితేజ రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే..

ఈ సినిమాలో చిరు- రవితేజ ల మధ్య ఓ భారీ ఫైట్ ఉంటుందట. ఈ ఫైట్ నువ్వా – నేనా అన్నట్టు ఉంటుందని.. చిరు – రవితేజ ఈ ఫైట్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారని తెలుస్తోంది. దర్శకుడు బాబీ ఈ ఫైట్ ను చాలా బాగా డిజైన్ చేశాడట. ఈ ఫైట్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రాంచరణ్ – ఎన్టీఆర్ ల ఫైట్ ను గుర్తుచేసే విధంగా ఉంటుంది అని ఇన్సైడ్ టాక్.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus