హీరో పారితోషికం అనేది వాయిదాల పద్దతిలో ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే. అది కూడా అగ్రిమెంట్ ప్రకారమే ఉంటుంది కూడా..! ఇప్పుడు ఓ హీరో గురించి చెప్పుకుందాం. ఈ టాలీవుడ్ హీరో… స్టార్ హీరోకి తక్కువ .. మిడ్ రేంజ్ హీరోకి ఎక్కువ క్రేజ్ ను కలిగి ఉన్నాడు. మాస్ ఆడియెన్స్ లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. కష్టపడి.. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చాడు అనే రెస్పెక్ట్ కూడా ఉంది.
చాలా మంది కొత్త దర్శకులని పరిచయం చేశాడు అనే మంచి పేరు ఇండస్ట్రీలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇతను వేస్తున్న చీప్ వేషాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇతని గత సినిమా రిలీజ్ టైంలో డబ్బింగ్ చెప్పనంటూ మొండికేసాడు.. నిర్మాత బ్రతిమిలాడితే ‘రూ.2 కోట్లు ఇస్తే డబ్బింగ్ చెబుతా లేదంటే వేరే వాళ్ళ రూ.1 లక్ష, రూ.2 లక్షలకి చెప్పించేసుకోండి’ అంటూ చెప్పాడట. డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో చెప్పిస్తే ఒరిజినాలిటీ మిస్ అవుతుంది..
పైగా ప్యాచ్ వర్క్ కూడా ఉంది కాబట్టి నిర్మాత హీరో అడిగిన రూ.2 కోట్లు ఇచ్చేసాడు. ఇక తాజాగా మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్ వేశాడు హీరో. ఈసారి అసలే ప్లాపుల్లో ఉన్న నిర్మాతతో సినిమాని ఓకె చేసాడు.పైగా దానిని డైరెక్ట్ చేసేది కొత్త దర్శకుడు. కాబట్టి బిజినెస్ ఏమీ అవ్వడం లేదు. ఇప్పటివరకు అయిన బిజినెస్ కూడా హీరో పేరు క్రేజ్ వల్ల అయ్యిందే. అయితే హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో అనుకున్నదానికంటే ఓ 30 శాతం ఎక్కువ వచ్చిందట.
ఈ విషయం కాస్త హీరో చెవిన పడింది. అంతే.. షూటింగ్ కు రాను అంటూ చీప్ వేషాలు వేయడం మొదలుపెట్టాడు. ఇండైరెక్ట్ గా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు అని నిర్మాత అసిస్టెంట్ గ్రహించి.. నిర్మాతతో ఈ విషయాన్ని చెప్పాడట. ఇప్పుడు ఆ నిర్మాత ఆ పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.