యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. నైజాంలో ఈ మూవీని రూ.25 కోట్లకు కొనుగోలు చేయగా 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.39.71 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇక్కడి బయ్యర్స్ కు భారీ లాభాలను అందించింది ఈ మూవీ. అయితే ఆంధ్రాలో మాత్రం ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది.
సీడెడ్ | 12.00 cr |
ఉత్తరాంధ్ర | 10.00 cr |
ఈస్ట్ | 6.00 cr |
వెస్ట్ | 5.00 cr |
కృష్ణా | 6.00 cr |
గుంటూరు | 7.00 cr |
నెల్లూరు | 3.00 cr |
ఏపి | 49.00 cr కోట్లు(షేర్) |
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రాన్ని రూ.49 కోట్లకి కొనుగోలు చేసారు. అయితే ఇప్పటి వరకు
సీడెడ్ | 10.51 cr |
ఉత్తరాంధ్ర | 6.95 cr |
ఈస్ట్ | 5.16 cr |
వెస్ట్ | 3.17 cr |
కృష్ణా | 3.84 cr |
గుంటూరు | 4.17 cr |
నెల్లూరు | 2.48 cr |
ఏపి + తెలంగాణ | 36.28 cr కోట్లు |
13 రోజులకి ఈ చిత్రం ఆంధ్రాలో రూ.36.28 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే అక్కడ బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈస్ట్, నెల్లూరు తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో ఈ మూవీ టార్గెట్ పెద్దదిగా ఉంది. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుంది కాబట్టి థియేటర్లు బాగా తగ్గుతాయి. కలెక్షన్లు ఇక నమోదు అయ్యే అవకాశం ఉండదు.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో ‘కె.జి.ఎఫ్2’ కి తక్కువ వసూళ్లు నమోదవ్వడానికి కారణం తక్కువ టికెట్ రేట్ల వల్లనే అని తెలుస్తుంది. 5వ షోకి పర్మిషన్ ఇచ్చి ఉన్నా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!