మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలిజ్ కానుండటం గమనార్హం. అయితే అదిపురుష్ మూవీకి నైజాంలో అన్యాయం జరుగుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మైత్రీ నిర్మాతలు ఆదిపురుష్ నైజాం హక్కులను 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
ఆదిపురుష్ సినిమాకు భారీగా థియేటర్ రెంట్లను పెంచుతున్నట్టు కొంతమంది థియేటర్ల ఓనర్లు చెబుతున్నారని ఈ విధంగా చేయడం వల్ల మైత్రీ నిర్మాతలకు నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అదే సమయంలో ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ లు రాకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను మైత్రీ నిర్మాతలు రిలీజ్ చేసిన సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయంలో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు స్వార్థంగా వ్యవహరిస్తూ ఈ సినిమాకు ఆటంకాలను కలిగిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ పరిస్థితి మారే ఛాన్స్ ఉంటుంది. నైజాంలో కొంతమంది పెద్దలు కావాలనే ఇదంతా చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఆదిపురుష్ మూవీ భారీ లాభాలను అందిస్తుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే సగం బడ్జెట్ రికవరీ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండగా నటించగా ఈ సినిమా తర్వాత కృతిసనన్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణుని రోల్ లో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.