ఒకేసారి రెండు సినిమాలు.. నిర్మాతలకు భారీ నష్టాలు..?

  • October 29, 2022 / 07:42 PM IST

ఇద్దరు హీరోలు పోటాపోటీగా తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం వలన నిర్మాతలకు నష్టమే కానీ లాభం ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మైత్రి మూవీ మేకర్స్ వారికి ఎదురుకాబోతుంది. 2023 సంక్రాంతికి పోటీగా బాలయ్య, చిరంజీవిల సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాలకృష్ణ, మెగాస్టార్ లాంటి హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ టేకప్ చేశామనే ఆనందం కంటే ఇప్పుడు మైత్రి వారిలో టెన్షనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయడం వలన అనుకున్న మేరకు అడ్వాన్స్ లు రావడం కష్టమవుతుంది.

ఆ విషయం పక్కన పెడితే సరైన ఓపెనింగ్స్ కూడా రావు. ఆ కారణంగా మంచి నెంబర్స్ అయితే కనిపించవు. ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్స్ షురూ చేయడం కూడా ఖాయం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల రెవెన్యూ తేడా ఉంటుందని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడం లేదు. సంక్రాంతి కాబట్టి అదనపు రేట్లు అడగాలంటే..

బాలయ్య, చిరంజీవి ఇద్దరి సినిమాలకు అడగాలి. వాటితో పాటు ‘ఆదిపురుష్’ కూడా ఉంటుంది. ఇన్నింటిమధ్య ఏ సినిమాకి ఇస్తారు..? దేనికి ఇవ్వరు..? అనేది కూడా తేలాల్సి ఉంది. మరోపక్క అన్ని సినిమాలు సంక్రాంతికే అంటున్నారు కానీ.. ఇప్పటివరకు డేట్స్ అయితే చెప్పడం లేదు. మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి రెడీ అవుతున్నాయి.

ఇందులో ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియదు. వీటితో పాటు అజిత్ సినిమా కూడా రంగంలోకి దిగుతుంది. మరి దాని డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో సంక్రాంతికే రిలీజ్ అవుతుందా..? అనేది క్లారిటీ లేదు. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వం అని చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కూడా డబ్బింగ్ సినిమానే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus