Allu Arjun: పుష్ప 2:హాట్ స్టార్ నుంచి సాలిడ్ ఆఫర్!

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా కు తగ్గట్టుగానే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న పుష్ప 2పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పుష్ప 2 ది రూల్ గా రాబోతున్న అల్లుఅర్జున్ తప్పకుండా మరోసారి అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ కూడా మరికొన్ని సన్నివేశాలను రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Click Here To Watch Now

పుష్ప సెకండ్ పార్ట్ షూట్ దాదాపు 80 శాతం పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసే ఇప్పుడు మిగిలిన 20 శాతం షూటింగ్ విషయంలో భారీ స్థాయిలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇంతకుముందు చేసిన షూటింగ్ లోనే కొన్ని సన్నివేశాలను మరింత గ్రాండ్ గా రీ షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా నిర్మాతలకు భారీగా బిజినెస్ డీల్స్ కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నాన్ థియేట్రికల్ గా పుష్ప 2 సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా అడుగులు వేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ డిస్నీ ప్లస్ పుష్ప కు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన హక్కులను కూడా కొనుగోలు చేసే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం దాదాపు 250 కోట్ల వరకు మైత్రి మూవీ మేకర్స్ కు ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఆఫర్ పై చిత్ర నిర్మాతలు ఆ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట.

ఇంకా ఫైనల్ అగ్రిమెంట్ అయితే పూర్తి అవ్వలేదని తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ విషయంలో కాస్త కంగారు పడిన నిర్మాతలు మార్కెట్ కు అనుకున్నంతగా ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా హిందీలో చాలా తక్కువ ధరకు కేవలం 10కోట్లకు అమ్మగా అక్కడ వంద కోట్ల వసూళ్లను అందుకుంది. పుష్ప 2 విషయంలో మాత్రం తొందర పడకుండా బెస్ట్ డీల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మరి హాట్ స్టార్ ఆఫర్ చేసిన డీల్ కు మైత్రి మూవీ మేకర్స్ ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus