Ghani Movie: వరుణ్ తేజ్ సినిమాకు 24కోట్ల ఆఫర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నిసార్లు థియేట్రికల్ బిజినెస్ కంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో లాభదాయకంగా ఉంది. అందుకే హీరోలు కేవలం బాక్సాఫీస్ మార్కెట్ ను మాత్రమే కాకుండా శాటిలైట్, డిజిటల్ మార్కెట్ ను కూడా లెక్కల్లోకి తీసుకొని నెంబర్లు పెంచుతున్నారు. ఇక వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. వరుణ్ తేజ్ నెక్స్ట్ F3 మల్టీస్టారర్ తో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే కూడా గని సినిమాపైనే కూడా అంచనాలు గట్టిగా ఉన్నాయి.

ఎందుకంటే బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న వరుణ్ అసలైన బాడీని చూపించబోతున్నాడు. ఇంతవరకు వరుణ్ తేజ్ హైట్ కు తగ్గట్లుగా బాడీని చూపించలేదు. ఇక గని సినిమాలో హై వోల్టేజ్ లుక్కుతో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే సినిమా శాటిలైట్ ఓటీటీ హక్కులను కలిపి 24కోట్లకు ఆహాకు అమ్మేశారట.

శాటిలైట్ రైట్స్ ను ఆహా మళ్ళీ మరో ధరకు బయట అమ్ముకుంటుందట. ఇక కొడుకు నిర్మాతగా మొదటి సినిమా చేస్తున్నాడనే కారణమే కాకుండా సినిమా కథ కథనం అలాగే క్క్యాస్టింగ్ కూడా అల్లు నిర్మాతకు భాగానే నచ్చిందట. అందుకే భారీగా ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి సీనియర్ స్టార్స్ నటిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus