ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. అది కొంతమంది విషయంలో నిజమని కూడా ప్రూవ్ అయ్యింది. అలాంటి వారిలో కచ్చితంగా దర్శకుడు రమేష్ వర్మ (Ramesh Varma) కూడా ఉంటాడు అని చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుండి చూసుకుంటే ఇతని ఖాతాలో సరైన బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కటి కూడా లేదు. ‘ఒక ఊరిలో’ ‘రైడ్’ (Ride) వంటి యావరేజ్ సినిమాలు, ‘వీర’ (Veera) ‘ఖిలాడి’ (Khiladi) ‘అబ్బాయితో అమ్మాయి’ వంటి డిజాస్టర్లు ఇతని ఖాతాలో ఉన్నాయి.
‘రాక్షసుడు’ (Rakshasudu) సెమి హిట్ అనిపించుకుంది.పైగా అది రీమేక్ సినిమా కాబట్టి, దాని సక్సెస్ క్రెడిట్ కూడా రమేష్ వర్మ ఖాతాలో వేయలేం. సాధారణంగా ఇలాంటి ట్రాక్ రికార్డు మరో దర్శకుడికి ఉంటే ఈపాటికే దుకాణం సర్దేసేవాళ్ళు. కానీ రమేష్ వర్మకి మాత్రం చేతి నిండా ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాఘవ లారెన్స్ తో (Raghava Lawrence) ‘కాలభైరవ’ అనే సినిమా చేస్తున్నాడు. మరో పక్క ‘కిల్’ రీమేక్ కి కూడా ఇతనే దర్శకుడు. లారెన్స్ తో చేస్తున్నది ‘కిల్’ రీమేక్ కాదు అని కొందరు అంటున్నారు..
కానీ ఇటీవల తన స్నేహితుల వద్ద ‘లారెన్స్ తో కిల్ రీమేక్ చేస్తున్నట్టు’ చెప్పాడట. ఆ సంగతి అటు ఉంచితే.. నిర్మాతగా రమేష్ వర్మ 2 సినిమాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా బాలీవుడ్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరోపక్క ‘రాక్షసుడు 2’ కూడా అనౌన్స్ చేశారు. మరో 2 కథలు కూడా ఫైనల్ అయ్యాయట. వాటికి కూడా నిర్మాతలు ఉన్నారు. ఏ ప్లాప్ దర్శకుడు కూడా ఇంత బిజీగా అయితే లేడు. ఆ రకంగా చూసుకుంటే.. రవితేజ (Ravi Teja) చెప్పినట్టు రమేష్ వర్మకి శుక్రమహార్దశ ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.