మహేష్ బాబుకు (Mahesh Babu) ఈడీ నోటీసులు అందడం చర్చనీయాంశం అయ్యాయి. ఏప్రిల్ 27న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో ఆయన లీగల్ టీం అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ రైడ్స్ జరిగాయి. అందులో భాగంగా వారికి కీలక ఆధారాలు కూడా లభించాయి.ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన యాడ్స్ కి గాను మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికం అందుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా ఇల్లీగల్ గా మహేష్ బాబు అందుకున్నట్టు కూడా ఈడీ అధికారుల వద్ద పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. మహేష్ బాబు చేసిన ప్రకటనలు చూసి చాలా మంది ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు అనే ఆరోపణలు ఉన్నాయి.సదరు రియల్ ఎస్టేట్ సంస్థ పాల్పడ్డ అక్రమాలలో మహేష్ హ్యాండ్ లేనప్పటికీ ఇల్లీగల్ గా డబ్బులు తీసుకోవడం అనేది క్రైమ్ అని చట్టం భావిస్తే మహేష్ చిక్కుల్లో పడినట్టే..!
అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై గట్టి చర్చ నడుస్తుంది. ఈడీ విచారణ తర్వాత మహేష్ ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే దాన్ని పూర్తిస్థాయిలో సమర్ధించడానికి కూడా లేదు. విచారణకి టైం ఉంది కాబట్టి.. మహేష్ లీగల్ టీం కనుక ఏదైనా లాజిక్ పై ఈ సమస్య నుండి అతన్ని దాటించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.