సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇటీవల ఓ అవార్డు వేడుకలో పాల్గొని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఓ నటికి చురకలు అంటించినట్టు స్పష్టమవుతుంది. సిమ్రాన్ మాట్లాడుతూ.. “రీసెంట్ గా నేను ఒక సినిమా చూశాను. అందులో ఓ నటి పెర్ఫార్మన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో వెంటనే ఆమెకు మెసేజ్ చేసి అప్రిషియేట్ చేశాను. ‘మీ నటన చాలా బాగుంది’ అంటూ ఆమెకు మెసేజ్ చేశాను.
అయితే దానికి ఆమె ఇచ్చిన రిప్లై చూసి షాక్ అయ్యాను. ‘ఆంటీ రోల్స్ కంటే ఇవే బెటర్ లెండి’ అంటూ ఆమె జవాబిచ్చింది. ఆమె పంపిన రిప్లై నన్ను చాలా బాధపెట్టింది. నేను అభినందించడానికి మెసేజ్ చేస్తే.. ఆమె ఇలాంటి రిప్లై ఇచ్చి నన్ను విమర్శించేలా జవాబివ్వడం అనేది నాకు చిన్నతనంగా అనిపించింది. అయితే ఈ వేదికగా ఆమెకు ఇప్పుడు చెప్తున్నా.. ‘సినిమాల్లో పనికిమాలిన డబ్బా రోల్స్ చేయడం కంటే.. అవకాశం ఉంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు చేయడం చాలా బెటర్.
ఎలాంటి పాత్రలు చేసినా హుందాగా చేయాలి. మనల్ని ఏదో రకంగా అవి ముందుకు నడిపిస్తున్నాయి అని సంతృప్తి చెందాలి. అన్నిటికీ మించి మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా ముందుకు సాగగలం. పక్కవాళ్ళని చులకనగా చూడకూడదు” అంటూ పరోక్షంగా ఆమె ఎవరికైతే మెసేజ్ చేసిందో ఆ నటికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఏ నటి నుండి అయినా కౌంటర్ వచ్చిందంటే… సిమ్రాన్ ఆమెనే ఉద్దేశించి అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.