స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి, బాహుబలి2 సినిమాలతో సంచలనాలను సృష్టించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు కనీవిని ఎరుగని స్థాయిలో రికార్డులను సృష్టించాయి. ఒక విధంగా చెప్పాలంటే జక్కన్న బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. అయితే ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి తను సృష్టించిన చరిత్రను తిరగరాయాల్సి ఉంది. తను సినిమాల ద్వారా క్రియేట్ చేసిన రికార్డులను ఆర్ఆర్ఆర్ తో జక్కన్న తనే బ్రేక్ చేయాల్సి ఉంది.
మరి బాహుబలి2 సినిమాను మించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. చరణ్, తారక్ ఒకే సినిమాలో నటించడం ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచడంతో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆర్ఆర్ఆర్ కు రిపీట్ ఆడియన్స్ ఉంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు 500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరగగా ఈ సినిమా కనీసం 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. ముంబై లాంటి నగరాల్లో హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కే ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. జక్కన్న సినిమా విడుదలైన తర్వాత ప్రమోషన్స్ ను కొనసాగిస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంటుందనడంలో సందేహం అవసరం లేదు.
ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అలియా భట్, అజయ్ దేవగణ్ లకు కూడా క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ తారక్, చరణ్ లకు ఎంతో కీలకం కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ కు ముందే నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.