అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోలుగా ఎన్టీఆర్, చరణ్

బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న సినిమాపై అందరి చూపు ఉంది. ఆయన తొలిసారి మల్టీ స్టారర్ మూవీ చేయడం.. అది కూడా నందమూరి, మెగా హీరోలు కలిసి నటిస్తుండడం ఆ క్రేజ్ కి ప్రధాన కారణాలు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నగర శివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ పనులు పూర్తికావచ్చాయి. ఒలింపిక్స్ నేపథ్యంలో నడిచే ఈ కథ కోసం ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో పడ్డారు. ఈ మూవీ డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాని కంప్లీట్ చేసి .. ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్ మాత్రం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న చిత్రాన్ని కంప్లీట్ చేయడంలో నిమగ్నమయి ఉన్నారు.

పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో కలిసి RRR సెట్ లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరూ ఈ సినిమా కోసం 200 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. అంటే షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ని కలుపుకుంటే ఏడాది పాటు ఈ సినిమా కోసమే పనిచేయనున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి తో పాటు ఎన్టీఆర్, చరణ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని ఫిలిం నగరవాసులు చెప్పారు. లాభాల్లో షేర్ అందుకోనున్నట్టు తెలిసింది. రాజమౌళి సినిమాకి వచ్చే ఆదాయాన్ని బట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఒక్కొక్కరు 50 కోట్లదాకా అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కానీ నిజమైతే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోలుగా వీరి పేర్లు నిలిచిపోతాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus