అసలేప్పుడు మొదలెట్టారో కూడా తెలియదు, ఉన్నట్లుండి పబ్లిసిటీ స్టార్ట్ చేసేసి.. అనతికాలంలో ప్రభాస్ చేత ఆడియో విడుదల చేయించి క్రేజ్ సంపాదించుకొంది “ఆనందో బ్రహ్మ” అండ్ టీం. “పాఠశాల” అనే బిలో యావరేజ్ మూవీతో డైరెక్టర్ గా మారిన మహి వి.రాఘవ దర్శకత్వంలో తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్ లు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదలై కామెడీ బాగా పండడంతో జనాల్ని ఓ మోస్తరుగా అలరించింది. ఆ వారం వేరే సినిమా లేకపోవడం.. పూర్తిస్థాయి కామెడీ సినిమా తెలుగులో వచ్చి చాలా కాలం అవ్వడం వంటి విషయాల వల్ల “ఆనందో బ్రహ్మ” అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సూపర్ హిట్ అయ్యింది.
మొదటివారంలోనే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల షేర్ ను సొంతం చేసుకొన్న “ఆనందో బ్రహ్మ” ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాగే.. ఇప్పుడు ఆ సినిమా ఖాతాలో మరో రికార్డ్ చేరింది. స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలకే మూడు కోట్ల రూపాయల శాటిలైట్ రేట్స్ వర్కవుట్ అవ్వక ఇబ్బందిపడుతున్న తరుణంలో.. జీ తెలుగు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో “ఆనందోబ్రహ్మ” సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. చూస్తుంటే నిర్మాతలకు ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టేలా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.