మహేష్ స్పైడర్ పాటకోసం భారీ సెట్
- July 1, 2017 / 06:17 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ టాకీ పార్ట్ పూర్తి కాగానే మహేష్ రెస్ట్ తీసుకోకుండా కొరటాల శివ ప్రాజక్ట్ ని పట్టాలెక్కించారు. భరత్ అను నేను అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. రేపటితో కొన్ని సీన్లు కంప్లీట్ చేసి ఈనెల ఐదవ తేదీ నుంచి స్పైడర్ లో మిగిలిఉన్న రెండు పాటల్లో ఒక పాట చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం భారీ సెట్ ను వేశారు. ఈ ప్రత్యేక సెట్ కోసం ఏకంగా కోటిన్నర ఖర్చు చేసారని సమాచారం. మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు 80 మంది డాన్సర్స్ పాల్గొంటారని తెలిసింది.
ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ కనిపించనున్న ఇందులో విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















