SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమా కోసం భారీ ఖర్చు!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ను ఈ నెలలోనే మొదలుపెట్టాల్సివుంది కానీ ఇప్పుడు ఆలస్యమయ్యేలా ఉంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్ ను నిర్మించబోతున్నారు. అందులో కీలకమైన సెట్ ను నగర శివార్లలలో నిర్మిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం భారీ సెట్ వేసిన ప్రదేశంలోనే ఈ సెట్ ను కూడా నిర్మిస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మరో సినిమా చేయడానికి మహేష్ బాబుకి ఎక్కువ సమయమే పడుతోంది. త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్ ను మహేష్ కు సకాలంలో చెప్పలేకపోవడమే కారణమని చెబుతారు. మొదట ఒక స్క్రిప్ట్ ను చెప్పడం, ఆ తరువాత యాక్షన్ సీన్ తీసేసి మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ తయారు చేయడం జరిగాయి. పక్కా ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మహేష్, త్రివిక్రమ్, తమన్ దుబాయ్ కి వెళ్లారు.

వీరితో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఈ సిట్టింగ్స్ లో పాల్గొనున్నారు. దీనికోసం అందరికీ వేర్వేరు హోటల్స్ లో రూమ్స్ బుక్ చేశారు. దీనికి బాగానే ఖర్చు అవుతోంది. ఇప్పటివరకు జరిగిన స్టోరీ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్, కొన్ని రోజుల షూటింగ్స్, సంగీత చర్చలు అన్నింటికీ కలిపి కోట్లలోనే ఖర్చయింది. మొత్తంగా చూసుకుంటే అసలు సెట్స్ పైకి వెళ్లకముందే భారీగా ఖర్చయిందని

యూనిట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాకి మహేష్ బాబు, త్రివిక్రమ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. త్రివిక్రమ్ సినిమాలంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి సినిమా పూర్తయ్యేసరికి ఎంత బడ్జెట్ అవుతుందో..?

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus