Samantha: సామ్ మూవీ బుకింగ్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే?

ఏప్రిల్ నెల 28వ తేదీన సమంత పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. సమంత పుట్టినరోజు కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కణ్మణి రాంబో ఖతీజా రిలీజ్ కానుంది. తమిళంలో ఈ సినిమా కాత్తువాకుల రెండు కాదల్ పేరుతో రిలీజ్ కానుండగా తమిళంలో బాగానే అంచనాలు ఏర్పడినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ఆచార్య సినిమా 29వ తేదీన విడుదల కానుండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

హైదరాబాద్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. పలు థియేటర్లలో ఈ సినిమా షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పుట్టినరోజునే సమంతకు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ సినిమాకు బుకింగ్స్ బాగా లేకపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా దారుణంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

వాస్తవానికి సమంత, నయనతారలకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంది. దర్శకునిగా విఘ్నేష్ శివన్ కు కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే వీళ్లెవ్వరూ తెలుగు వెర్షన్ కు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. సమంత అభిమానులలో చాలామంది ఈ సినిమా రిలీజ్ గురించి కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. ఆచార్యకు పాజిటివ్ వస్తే కణ్మణి రాంబో ఖతీజా మూవీని ప్రేక్షకులు పట్టించుకునే ఛాన్స్ కూడా లేదు.

నయనతార, సమంత కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. నయన్, సామ్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాలి. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రమే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో గ్లామర్ షో ద్వారా స్టార్ హీరోయిన్ సమంత వార్తల్లో నిలవడం గమనార్హం.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus