Samantha: సమంతకు అక్కడ దిమ్మతిరిగే షాక్.. అంత తక్కువా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తానని భావించగా ఈ సినిమా భిన్నమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాకు పలు ఏరియాలలో కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. ఉత్తరాంధ్రలో యశోద సినిమా తొలిరోజు 16 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమాకు కేవలం 14 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. శాకుంతలం సినిమా కలెక్షన్లను చూసి సమంత ఫ్యాన్స్ షాకవుతున్నారు. 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇంత దారుణంగా కలెక్షన్లు వస్తాయని ఊహించలేదని కొంతమంది కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

శాకుంతలం సినిమా విషయంలో దిల్ రాజు ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని ఈ సినిమాకు ప్రీమియర్స్ వేయకుండా ఉండి ఉంటే సినిమా ఫలితం మరింత బెటర్ గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు గుణశేఖర్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమేనని చెప్పవచ్చు. స్టార్ హీరోలు సైతం గుణశేఖర్ ను నమ్మే పరిస్థితులు లేవు. రుద్రమదేవి హిట్ అయినా ఆ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ కాదు.

మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ పై గుణశేఖర్ కు మంచి పట్టు ఉన్నా ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలను తెరకెక్కించే విషయంలో ఆయన తడబడుతున్నారు. శాకుంతలం రిజల్ట్ సమంత కెరీర్ పై, రెమ్యునరేషన్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సామ్ దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఖుషి సినిమాపై పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.

అనారోగ్య సమస్యల నుంచి సమంత (Samantha) కోలుకుని వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ కావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం రిజల్ట్ విషయంలో సమంత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సమంత పౌరాణిక పాత్రలకు సూట్ కారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus