మన్సూర్ అలీ ఖాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన్సూర్ అలీ ఖాన్ చిరు, త్రిషలపై పరువు నష్టం దావా వేయగా తాజాగా కోర్టు మన్సూర్ అలీ ఖాన్ కు భారీ షాకిచ్చింది. మన్సూర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఒక నటిపై మన్సూర్ అనుచిత వ్యాఖ్యలు చేయగా మిగతా ముగ్గురు నటులు ఆమెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారని పేర్కొంది. అలాంటి కామెంట్లు చేస్తే ఏ మనిషైనా అలానే స్పందిస్తాడని కోర్టు వెల్లడించింది.
ఈ విషయంలో త్రిషకు అనుకూలంగా మాట్లాడిన వాళ్లపై పరువు నష్టం దావా వేయడానికి వీలు లేదని కోర్టు వెల్లడించింది. మన్సూర్ అలీ ఖాన్ ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉందని కోర్టు పేర్కొంది. మన్సూర్ అలీ ఖాన్ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో పాటు లక్ష రూపాయలు ఫైన్ విధించింది. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు ఆ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు మన్సూర్ కు ఆదేశాలు జారీ చేసింది.
మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) ఇకనైనా మారితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారం కామెంట్లు చేయడం ద్వారా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్సూర్ అలీ ఖాన్ కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు అయితే తగ్గాయని ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఇష్టానుసారం కామెంట్లు చేయడం వల్ల మన్సూర్ అలీ ఖాన్ కెరీర్ ప్రమాదంలో పడిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మన్సూర్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం సంతోషిస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్ తప్పు మీద తప్పు చేయడం అతని కెరీర్ కు శాపం అవుతోంది.