Prabhas: సలార్ మూవీ కోసం అప్పటివరకు ఎదురుచూడాలా?

  • June 29, 2022 / 06:26 PM IST

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని మొదట మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా వల్ల కేజీఎఫ్2 రిలీజ్ డేట్ మారడంతో సలార్ రిలీజ్ డేట్ మారింది. అయితే ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ నత్తనడకన సాగుతోంది. సలార్ సినిమాతో పాటు ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడం లేదని తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం వరకు 2023 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కాదని తెలుస్తోంది. కుదిరితే 2023 సెకండాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అప్పటికీ ఈ సినిమా రిలీజ్ సాధ్యం కాకపోతే 2024 సంవత్సరంలో సలార్ మూవీ రిలీజవుతుందని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్2 సక్సెస్ తో సలార్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి.

ఆ అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఈ సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో నటించే నటీనటుల రెమ్యునరేషన్, డైరెక్టర్, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ల కోసమే 180 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సలార్ సినిమాతో ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమా కోసం ప్రభాస్ తన లుక్ ను మార్చుకున్నారు. ఈ సినిమాలో శృతి జర్నలిస్ట్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైతే మాత్రమే ఈ సినిమా కథ గురించి అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ కు రోజురోజుకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus