టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దేవిశ్రీ ప్రసాద్, థమన్ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ల హవా పెరుగుతోంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో పాటు మిడిల్ రేంజ్ హీరోలు సైతం ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా థియేటర్లలో విడుదలైన కస్టడీ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. అఖిల్ ఏజెంట్ మూవీకి హిప్ హాప్ తమిజ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి ఏఆర్ రెహమాన్ పని చేస్తారని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజాలు తెలియాల్సి ఉంది. సాయితేజ్ విరూపాక్ష మూవీకి అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయగా ఈ సినిమాకు ఆయన ప్లస్ అయ్యారు.
నితిన్ తర్వాత ప్రాజెక్ట్ కు హరీష్ జైరాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్11కు యువన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. నితిన్ వెంకీ కుడుముల, వైష్ణవ్ శ్రీకాంత్ రెడ్డి కాంబో మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాకు, సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి, నాని30 సినిమాలకు అబ్దుల్ వాహబే పని చేస్తున్నారు. దేవిశ్రీ, థమన్ (Thaman) అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మ్యూజిక్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో కష్టమేనని చెప్పవచ్చు.