టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు (Trivikram) మంచి గుర్తింపు ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అజ్ఞాతవాసి (Agnyaathavaasi) మినహా దాదాపుగా అన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఖలేజా (Khaleja) , గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలు సైతం కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్స్ అని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ కాంబో మూవీ టార్గెట్ కూడా 1000 కోట్లేనని తెలుస్తోంది. బన్నీ పుష్ప2 (Pushpa 2: The Rule) సినిమాతో ఈ టార్గెట్ సాధిస్తే మాత్రం బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ టార్గెట్ ఊహించని స్థాయిలో ఉంటుందని టార్గెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.
ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ ముందు భారీ లక్ష్యం ఉండబోతుందని తేలిపోయింది. ఆ భారీ లక్ష్యాన్ని త్రివిక్రమ్ అలవోకగా సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo) అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. డైలాగ్స్ కోసమే త్రివిక్రమ్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు సైతం ఉన్నారంటే ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బన్నీ త్రివిక్రమ్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడం, బన్నీ త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ కాంబోలో వచ్చే సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల కానుంది. పుష్ప ది రూల్ సినిమాపై నార్త్ బెల్ట్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) నార్త్ బెల్ట్ లో సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించే అవకాశాలున్నాయి.