మనిషి, మనిషి ఏకమవ్వాలంటే.. ఒక కార్గిల్ యుద్ధమో, సునామీనో, భూకంపమో, వరదలో రావాలా? అని ప్రశ్నిస్తూ నటుడు విక్రమ్ రూపొందించిన “స్పిరిట్ ఆఫ్ చెన్నై” వీడియో ఆల్బమ్ భాషా బేధం లేకుండా ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకట్టుకొంటోంది. ఈ వీడియో ఆల్బమ్ లో తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులతోపాటు.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా నటించడం విశేషం.
సూర్య, కార్తీ, సిద్దార్థ్, ప్రభుదేవ, జయం రవి, పృథ్వీ రాజ్, విజయ్ సేతుపతి, జీవా, నివిన్ పౌలీ, యష్, నయనతార, నిత్యామీనన్, అమలాపాల్, ఖుష్బూ, చార్మీ, బాబీ సింహా, భరత్ వంటి తమిళ, కన్నడ మలయాళ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఈ వీడియో ఆల్బమ్ లో మెరిశారు. ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగిన ఈ ఆల్బమ్ ద్వారా.. మనిషికి మానవత్వం ముఖ్యం అని చెప్పడం ద్వారా ఈ ఆల్బమ్ కు దర్శకుడైన విక్రమ్ తనలోని మానవత్వాన్ని ఘనంగా చాటుకోవడంతోపాటు.. ఇంతమంది నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను ఒక్కచోటికి చేర్చి నిజమైన కథానాయకుడు అనిపించుకొన్నాడు.