Divi: ‘బిగ్ బాస్’ బ్యూటీ దివి విద్యా కి అరుదైన గౌరవం..!

‘బిగ్ బాస్4’ షో లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొని బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది దివి విద్యా. ఈ షో ద్వారా ఈమెకు ఏర్పడిన క్రేజ్ వలన వరుస సినిమా అవకాశాలను ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా… తాజాగా ఈ బ్యూటీ టెలివిజన్ కు గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 గా నిలవడం విశేషం.దీంతో ఇప్పుడు దివి పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇక ఈ విషయం పై హైదరాబాద్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

దివి మాట్లాడుతూ..“నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ చాలా ఉన్నతమైనది. అది నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.దీనికి ముఖ్య కారణం నా అందం కంటే.. ప్రజలు నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నారు అని నేను నమ్ముతున్నాను. నేను ఎక్కువగా మానసికంగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. అందం అనేది కాలంతో పాటు మారుతుంది. కానీ మానసిక ఆనందం, అందం ఎప్పటికీ మనతోనే ఉంటాయి.

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ అనేది నాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది అని ఆకాంక్షిస్తున్నాను. 70 ఎం.ఎం స్క్రీన్ పై కూడా నన్ను నేను చూసుకోవాలని తాపత్రయపడుతున్నాను.మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్న దివి ‘లంబసింగి’ అనే చిన్న చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక ‘క్యాబ్ స్టోరీస్‌’ అనే చిత్రంతో దివి ఇటీవల ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus