మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer) ఎట్టకేలకు 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా, సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రామ్ చరణ్ ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా తన నటనలో కొత్త కోణం చూపించబోతున్నాడు.
అయితే సినిమాలో ప్రధానంగా హైడ్రా ఎపిసోడ్ ఉండనున్నట్లు టాక్ వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే, ఈ ఎపిసోడ్స్ పూర్తిగా కల్పిత కథగా మాత్రమే చిత్రీకరించినట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇందులో చరణ్ పాత్ర ప్రభుత్వం తరపున చేసిన చర్యలపై ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, న్యాయవాదనను దృఢంగా చూపిస్తుందట.
ఈ ప్రత్యేక సన్నివేశాల చిత్రీకరణ గత ఏడాదిలోనే పూర్తయిందని తెలుస్తోంది. శంకర్ తన ప్రత్యేక మేకింగ్ శైలితో ఈ ఎపిసోడ్‌ను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించినట్లు సమాచారం. దీనికి తెలంగాణ హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఇక రామ్ చరణ్ నటనకు ఇప్పటికే చిత్ర బృందం నుంచి ప్రశంసలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఇటువంటి సామాజిక విషయాలను తీసుకుని ప్రేక్షకులకు ప్రేరణగా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య (SJ Suryah) కీలక ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్‌తో తలపడే విలనిగా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. అందుకే ఈ సినిమా సెకండాఫ్‌లో హైడ్రా ఎపిసోడ్ కీలకంగా మారనుందని టాక్. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా కనిపించగా, శ్రీకాంత్ (Srikanth) , సునీల్ (Sunil) అంజలి (Anjali) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక థమన్ (S.S.Thaman) త్వరలోనే మరో సాంగ్ అప్డేట్ తో రానున్నాడు. ప్రస్తుతం అతను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నారు.