Hyper Aadi: పవన్ కళ్యాణ్ పేరు చెప్పి హైపర్ ఆది వార్నింగ్.. ఏం జరిగిందంటే?
- June 23, 2024 / 02:48 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు సంబంధించి సాధిస్తున్న విజయాలు సంచలనం అయ్యాయనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాజాగా అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ సైతం నెట్టింట వైరల్ అయింది. తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పిఠాపురంలో ఎన్నికలకు ముందు పవన్ తరపున హైపర్ ఆది (Hyper Aadi) , మరి కొందరు కమెడియన్లు ప్రచారం చేశారు.
అయితే ఢీ షో లేటెస్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా ప్రోమోలో “నేనెవరో తెలుసు కదా.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అంటూ హైపర్ ఆది చెప్పిన డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఢీ షో కంటెస్టెంట్ పండు “నువ్వెన్ని చెప్పినా కూడా ఈరోజు తగ్గేదేలేదు.. అడ్డొస్తే తొక్కిపడేస్తా” అంటూ డైలాగ్ చెప్పగా హైపర్ ఆది వెంటనే “మనం ఎవరి తాలూకానో తెలుసు కదా.. నీకు పిఠాపురం గుర్తుందా” అని చెప్పుకొచ్చారు.

హైపర్ ఆది అలా చెబుతున్న సమయంలో బ్యాగ్రౌండ్ లో “మనల్ని ఎవడ్రా ఆపేది” అనే డైలాగ్ ప్లే కావడం గమనార్హం. హైపర్ ఆది ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ లో పాల్గొననున్నారని మొదట హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ కేటాయించారని వార్తలు వినిపించాయి.

అయితే హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం (A. M. Rathnam) మాత్రం పవన్ కళ్యాణ్ కొంచెం ఫ్రీ అయ్యాక వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని చెప్పుకొచ్చారు. పవన్ పాత్రకు సంబంధించిన బ్యాలెన్స్ కొన్నిరోజులు మాత్రమే ఉందని ఏఎం రత్నం పేర్కొన్నారు. పవన్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

















