Akshay Kumar: ట్రోలింగ్ దెబ్బకి దిగొచ్చిన అక్షయ్ కుమార్!

ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర హీరోలు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యాడ్స్ తోనే కోట్లలో సంపాదిస్తున్నారు మన హీరోలు. కూల్ డ్రింక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, మద్యం ఇలా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోలు పొగాకు, పాన్ మసాలా వంటి ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నారు. కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుండడంతో మన హీరోలు కూడా ఇలాంటి యాడ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు.

Click Here To Watch NOW

ఇప్పటికే స్టార్ హీరోలు చాలా మంది ఇలాంటి యాడ్స్ లో నటించారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా పొగాకుని ప్రమోట్ చేస్తుండడంతో మండిపడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా సదరు హీరోలను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన పాన్ మాసాల యాడ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అభిమానులు సైతం ఈ విషయంలో అక్షయ్ కుమార్ పై కోపంగా ఉన్నారు.

దీంతో అక్షయ్ కుమార్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఇలాంటి ప్రకటనలో నటించినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఏం రాశారంటే..? ‘అభిమానులు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. గత కొద్దిరోజులుగా మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను పొగాకును ఆమోదించలేదు.. ఆమోదించను కూడా. మీ ఎమోషన్స్ ను నేను గౌరవిస్తున్నాను. బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నాను.

ఆ ప్రకటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తాను. అయితే కాంట్రాక్ట్‌ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది. కానీ ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించనని మాటిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus