Vijayendra Prasad: తన సినిమా కథల గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!
- November 24, 2022 / 12:44 AM ISTByFilmy Focus
విజయేంద్ర ప్రసాద్.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేశారు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. రాజమౌళి అన్ని సినిమాలకూ కథలు రాసేది ఆయనే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా స్టోరీ మీద వర్క్ చేస్తున్నారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆయణ్ణి రాజ్యసభ పదవికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
అలాంటి విజయేంద్ర ప్రసాద్ నేను కథలు రాయను..కాపీ కొడతాను అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ ఫిలిం రైటింగ్ విభాగానికి సంబంధించి స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అబద్ధాలు చెప్పేవారే మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..

అలాగే ఏమీ లేని ఓ విషయం నుండి మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి ఆసక్తికరమైన అంశాన్ని వెలికితీయడమే రచయిత ముఖ్య లక్షణమని అన్నారు. ‘‘హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆడియన్స్.. ఇలా అందర్నీ మెప్పించే కథలు రాయాలి.. ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం.. ఒక అబద్ధాన్ని అందంగా చూపించడమనేదే కథా రచన.. నేను కథలు రాయను, దొంగిలిస్తాను.. మన చుట్టూ.. మన నిజ జీవితంలోనే చాలా కథలుంటాయి..

రామాయణం, మహాభారతం లాంటి మన ఇతిహాసాలు.. మన చరిత్రల నుండి చాలా కథలు వస్తాయి. నేను కూడా అక్కడినుండే కథలు తీసుకుంటాను.. ఆ కథల్ని మన స్టైల్లో రాసుకోవాలి’’ అంటూ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్ ‘అర్థాంగి’, ‘శీకృష్ణ 2006’, ‘రాజన్న’, ‘శ్రీవల్లి’ సినిమాలకు దర్శకత్వం వహించారు. సమరసింహా రెడ్డి, రౌడీ రాథోర్, భజరంగి భాయిజాన్, మణికర్ణిక, మెర్సల్, తలైవి లాంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు రాశారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!














