‘బిగ్ బాస్3’ విన్నర్ ఆ సాంగ్ పాడే అవకాశం కోల్పోయాడు..!

ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్ సీజన్ 3’ విజేతగా నిలిచాడు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఇక హౌస్ నుండీ బయటకి వచ్చిన తరువాత రాహుల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. శ్రీముఖి మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్లే మీపై సింపతీ పెరిగి ఓట్లు పడ్డాయనే టాక్ ఉంది. దాని గురించి మీరేమంటారు? అని రాహుల్ యాంకర్ అడిగాడు.

రాహుల్ ఈ ప్రశ్నకి జవాబిస్తూ… “నేను ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వచ్చేప్పుడు ఓటింగ్ విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎన్ని ఓట్లు పడుతున్నాయో కూడా తెలీదు. అయితే శ్రీముఖి అన్ని వారాలు నన్ను నామినేట్ చేస్తానని చెప్పడంతో జనాలు అలా నాపై జాలిపడి గెలిపించారేమో..! అయితే నా స్నేహితులు మాత్రం ఇంట్లో మనిషిలా అందరితో కలిసిపోవడం, జెన్యూన్ గా ఉండడమే నీ విజయానికి కారణమైందని చెప్తున్నారు. హౌస్ లో ఎక్కువ రోజులు ఉండడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘రాములో రాములా’ పాట పాడే అవకాశాన్ని మిస్సయ్యాను.. ఇంకా చాలా పాటలు మిస్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాహుల్ హౌస్ లో ఉండడంతో ఆ పాటని అనురాగ్ కులకర్ణి పాడటం జరిగింది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus