ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా మారి “శ్రీ వల్లీ” సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక నిన్న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సంచలన కామెంట్స్ చేశారు. “కొడుకుగా నేను నా నాన్నని చూసి గర్వపడతాను. కాని సాటి దర్శకుడిగా మాత్రం ఆయన సినిమాలోని తప్పులన్నీ వెతికి చెబుతాను.” అని అన్నారు. ”నా సినిమా చూపిస్తే జూనియర్ ఆర్టిస్ట్ తలపాగా బాగాలేదు.. లైటింగ్ సరిగ్గా లేదు అంటూ ఆయన తప్పులు వెతుకుతారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను. అందుకోసమే వెయిట్ చేస్తున్నా.” అంటూ నవ్వుతూ చెప్పారు. అనంతరం తన తండ్రి రచయితగా పడిన కష్టం గురించి వివరించారు.
“మా నాన్న విజయేంద్ర ప్రసాద్, పెదనాన్న శివ శక్తి అనేక సినిమాలకు ఘోస్ట్ రైటర్స్ గా పనిచేశారు. ‘జానకిరాముడు’ సినిమాలో రచయితగా నాన్న పేరు టైటిల్ కార్డులో పడినప్పుడు చాలా సంతోషించాను. ఆ సినిమా గురించి సితార మ్యాగజైన్లలో వచ్చిన తొలి న్యూస్లో నాన్న పేరు చూసుకుని ఆ పత్రికను దేవుడు గదిలో పెట్టి పూజిం చాను” అని వివరించారు. చివరగా శ్రీవల్లి సినిమా విజయం అవ్వాలని రాజమౌళి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.