ఎవరు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా 80, 90ల మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పేర్లు చెబుతారు కానీ.. వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చిరంజీవి. అటువంటి చిరంజీవికి నేటితరం నటులు గౌరవం ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే.. కమెడియన్ ప్రియదర్శి తన అభిమాన కథానాయకుడు చిరంజీవిని కలిసిన సందర్భంలో పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ని ఓ ఐ.ఏ.ఎస్ అధికారి వక్రీకరించే ప్రయత్నించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ప్రియదర్శి ఏదో చిరంజీవి మీద అభిమానంతో “సదా మీ ఏకలవ్య శిష్యుడిని” అని ఆయనతో దిగిన ఫోటోను పోస్ట్ చేయగా.. నరహరి అనే ఐ.ఏ.ఎస్ అధికారి ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. “నేను చిరంజీవి గారి రుద్రవీణ చూసి ఐ.ఏ.ఎస్ అధికారి కావాలనుకున్నా. కానీ.. చిరంజీవిని పొగడకుంట సినీ ఫీల్డ్ లో ఉండడం కష్టమా బ్రదర్!” అని ఒక హైపోతెటికల్ క్వశ్చన్ వేశాడు నరహరి. మరి అందులో అసూయ ఉందో లేక చిరంజీవి అంటే కోపం ఉందో తెలియదు కానీ.. ఒక ఐ.ఏ.ఎస్ అధికారి అయ్యుండి నరహరి ఇలా రియాక్ట్ అవ్వడం పట్ల చిరంజీవి అభిమానులు మాత్రమే కాక సగటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. చిరంజీవి పొగిడిన వాళ్ళు ఎత్తులకు వెళ్లిపోలేదు… తిట్టినవారు నాశనమూ అవ్వలేదు. ఈ విషయాన్ని నరహరి గుర్తిస్తే బాగుండు.
1
2
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి