Allu Arjun: విజయ్ దేవరకొండ దారిలో బన్నీ నడుస్తున్నారా?

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలలో నటించి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. క్లాస్ స్టోరీ అయినా మాస్ స్టోరీ అయినా బన్నీ మాత్రం తన నటనతో సినిమా సక్సెస్ సాధించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మరో బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.

తన పేరును అల్లు అర్జున్ బ్రాండ్ గా మార్చేశారని సమాచారం. ఏఏ(AA) పేరుతో పేరుతో బన్నీ దుస్తుల వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ వ్యాపారంలో సత్తా చాటుతుండగా బన్నీ కూడా ఈ వ్యాపారంపై దృష్టి పెట్టడం గమనార్హం. ఇప్పటికే ఈ బ్రాండ్ తో దుస్తులు మార్కెట్ లోకి రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ ను మొదలుపెట్టిన బన్నీ అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ప్లేస్ లో ఏషియన్ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో విశేషాలు ఉండే విధంగా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ వ్యాపార రంగంలో కూడా రాణించాలని భావిస్తున్నారు. ఒకవైపు వరుస విజయాలతో దూసుకెళుతున్న బన్నీ వ్యాపారాల దిశగా అడుగులు వేస్తుండటంతో బన్నీ అభిమానులు సంతోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా బన్నీ ఏ ఈవెంట్ కు వెళ్లినా AA అనే బ్రాండ్‌ నేమ్ కనిపించడం వెనుక అసలు కారణం ఇదేనని సమాచారం.

AA బ్రాండ్ నేమ్ తో వస్తున్న దుస్తులు అందరికీ అందుబాటు ధరలలో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. బన్నీ పుష్ప ది రూల్ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus