ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా బన్నీ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరపున బన్నీ ప్రచారం చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత బన్నీపై ట్రోల్స్ రాగా తాజాగా ఒక ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్లు సైతం వివాదాస్పదం అయ్యాయి.
ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం హీరోలు స్మగ్లర్ల వేషాలు వేస్తున్నారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏ సందర్భంలో అన్నారో తెలియదని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మాట వరసకు అలా అని ఉంటారని నేను భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ అలా కామెంట్స్ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతుందని ఆయన పేర్కొన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) రావణుడు, దుర్యోధనుడు పాత్రలను పోషించారని అంత మాత్రాన ఆయన స్త్రీ జాతిని కించపరిచాడని అర్థం వస్తుందా అంటూ బన్నీ మామయ్య కామెంట్లు చేశారు. ఆ తర్వాత రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యారని ఈ సందర్భంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. పవన్ నటుడిగా ఉండి రాజకీయ నాయకుడు అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు.
సినిమా నటుడిని నటుడిలా చూడాలే తప్ప వారి వ్యక్తిత్వాలకు పాత్రల స్వభావాన్ని అంటగట్టే ప్రయత్నం చేయకూడదని ఆయన కామెంట్లు చేశారు. పవన్ తాను చేసిన కామెంట్స్ జనరల్ గా చేశానని చెబితే వివాదానికి శుభం కార్డు పడుతుందని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పవన్, బన్నీలతో మాట్లాడి చిరంజీవి (Chiranjeevi) ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన కామెంట్లు చేశారు.