అదొక చౌకబారు సినిమా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై దర్శకుడి రియాక్షన్!

  • November 29, 2022 / 02:22 PM IST

ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ముందంజలో ఉంటుంది. ఈ సినిమాను చాలా మంది ప్రశంసించారు. అలాంటి సినిమాను అవమానిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఈ సినిమాను గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గోవా చిత్రోత్సవం నిర్దేశించిన ప్రమాణాలకు ఏ మాత్రం తగని స్థాయిలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఉందని,

అసభ్యత అశ్లీలత కూడిన ఇలాంటి హింసాత్మక కంటెంట్ ని చూడాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 సినిమాలు బాగున్నాయని.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి మాత్రం షాక్ అయ్యామని చెప్పారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అసలు కరెక్ట్ కాదని అన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా గురించి ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కశ్మీర్ లోయలో ముప్పై ఏళ్ల క్రితం జరిగిన పండిట్ల ఊచకోత, ముస్లిం తీవ్రవాదులు చేసిన దారుణాలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు భారీ విజయం అందించింది. ఇప్పుడేమో ఇంటర్నేషనల్ డైరెక్టర్ సినిమాను తక్కువ చేసి మాట్లాడడం బాలీవుడ్ సహించలేకపోతుంది. బీజేపీ తన సొంత ఎజెండాతో ఈ సినిమాను ప్రోత్సహించిందనే కామెంట్స్ మొదటి నుంచి వినిపిస్తున్న తరుణంలో ఇలా జరగడం కొత్త చర్చలకు దారి తీస్తోంది.

మరిప్పుడు నాదవ్ లాపిడ్ చేసిన కామెంట్స్ పై వివేక్ అగ్నిహోత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘మేజర్’, ‘అఖండ’ సినిమాలను స్క్రీన్ చేశారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus