లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకి(Ilaiyaraaja) ఓ స్పెషల్ పేటెంట్ రైట్స్ కలిగిన పవర్ ఉంది. ఏ పబ్లిక్ ఈవెంట్లో అయినా లేదా సినిమాల్లో,డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కంటెంట్లో అయినా.. ఇళయరాజా పాటలు లేదా ట్యూన్స్ అతని అనుమతి లేకుండా వాడుకుంటే.. వాళ్ళు ఫైన్ కట్టేలా లీగల్ యాక్షన్ తీసుకునే.. హక్కు లేదా పవర్ ఆయనకు ఉంది. ఈ విషయంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి లెజెండ్స్ ను కూడా ఆయన విడిచిపెట్టలేదు.
ఆ విషయాలు అలా ఉంచితే.. ఇటీవల కాలంలో ఈ కాపీరైట్ హక్కుల విషయంలో ఇళయరాజా పూర్తిగా ఫోకస్ పెట్టినట్టున్నారు. అందుకోసం ఓ స్పెషల్ టీంని కూడా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఏ కొత్త సినిమాలో అతని పాటలు లేదా ట్యూన్స్ వాడినా చట్టబద్ధంగా లీగల్ యాక్షన్ తీసుకుని ఆ సినిమా నిర్మాతల నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయంలో చాలా మంది ఇళయరాజాని తప్పుబట్టినా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఆయన తగ్గడం లేదు.

ఈ ఏడాది చూసుకుంటే.. టాలీవుడ్ నిర్మాతలైన ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు తమ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘డ్యూడ్’ సినిమాల్లో ఇళయరాజా పాత పాటలు, ట్యూన్స్ ని వాడుకున్నారు. దీంతో ఇళయరాజా వారికి లీగల్ నోటీసులు పంపడం కూడా జరిగింది. ఈ ఇష్యూ రీత్యా ఇళయరాజా అండ్ టీంతో మైత్రీ మూవీ మేకర్స్ చర్చలు జరిపి ఓ ఒప్పందం చేసుకున్నారు. ఫైనల్ గా రూ.50 లక్షలు ఇళయరాజాకి ఫైన్ కట్టినట్టు సమాచారం.

ఇలాంటి లీగల్ ఇష్యూస్ వల్ల ఓటీటీ సంస్థలు ఆ సినిమాల స్ట్రీమింగ్..ను సైతం నిలిపివేసే పరిస్థితి వస్తుంది. దానికంటే కూడా ముందుగానే మాట్లాడుకుని ఎంతో కొంత చెల్లించి ఇళయరాజా నుండి రైట్స్ కొనుక్కోవడం బెటర్ అనే నిర్ణయానికి మైత్రి మూవీ మేకర్స్ వచ్చినట్టు తెలుస్తుంది.మలయాళం సూపర్ హిట్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ యూనిట్ ని కూడా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు ఇళయరాజా.
ఆ సినిమాలో కూడా ఇళయరాజా పాత పాటలు వాడటం జరిగింది. అందుకే వాళ్ళు కూడా తర్వాత చర్చలు జరిపి ఫైనల్ గా రూ.60 లక్షలు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నారు.
