ఇలియానాలో ఇంత చేంజ్ రావడానికి కారణం అతడేనా?

పోకిరి, దేవదాస్ వంటి సినిమాలతో ఒక్కసారిగా టాప్ రేసులోకి దూసుకుపోయిన హీరోయిన్ ఇలియానా. ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుండి తెలుగు ప్రేక్షకులు దూరంగానే ఉంటుంది. అయితే చాలా గ్యాప్ తరువాత రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించగా ఈ సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉంది. తెలుగు నుండి బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా మొదట్లో అక్కడ చాలా గ్లామర్ ఉన్న సినిమాల్లోనే నటించింది. ఆమెకి అక్కడ కూడా అంతగా ఆశించిన ఫలితాలు అనేవి రాలేదు. ఆ సమయంలో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ గోవా బ్యూటీకి ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పరిచయం అవ్వగా ఆమెను డిప్రెషన్ నుండి బయటకి తీసుకురాగా ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని, అప్పటినుండి గోవా బ్యూటీ మళ్ళీ సంతోషంగా ఉంటుందని తెలిసింది.

ఇక విషయంలోకి వెళితే, వీరిద్దరూ కలసి అప్పటినుండి డేటింగ్ చేస్తూ బయట అందరి ముందే ఓపెన్ గా తిరిగేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇలియానా ఓపెన్ గా ఎప్పుడు ఆండ్రూ నీబోన్ నా లవర్ అంటూ చెప్పకపోవడం విశేషం. వీరిద్దరి విషయంలో రూమర్స్ చాలా ఘాటుగానే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసిన కనిపించేవిరికి లాస్ట్ ఇయర్ ఏ పెళ్లికూడా అయిపోయిందంటూ రూమర్స్ చాలానే ఉన్నాయి. రూమర్స్ విషయం పక్కన పెడితే, ఇలా డిప్రెషన్ లో ఉన్న నన్ను అందులోనుండి తీసుకువచ్చి ఇప్పుడు ఇంత హ్యాపీ గా ఉన్నాను అంటే దానికి కారణం నా ప్రియుడే అని తెగ సంతోషపడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus