ఈ టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇంత దారుణమా?

  • May 3, 2022 / 10:28 PM IST

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతోంది. 2022 సంవత్సరంలో గడిచిన 4 నెలల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో కేవలం 5 సినిమాలు మాత్రమే హిట్లయ్యాయి. జనవరిలో బంగార్రాజు, ఫిబ్రవరిలో డీజే టిల్లు, భీమ్లా నాయక్, మార్చి నెలలో ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ నెలలో కేజీఎఫ్2 సినిమాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. టాలీవుడ్ సక్సెస్ రేట్ తగ్గుతుండటం ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు, మిడిల్ రేంజ్ సినిమాలకు పరిస్థితులు అనుకూలంగా లేవు.

ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫ్లాపవుతున్నాయి. కరోనా భయం తగ్గడంతో ప్రతి రెండు వారాలకు ఒక పెద్ద సినిమా విడుదలవుతుండగా పరిస్థితులను బట్టి చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గని, శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలకు మాత్రం ఫలితాలు షాకిచ్చేలా ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు మాత్రం నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించాయి. ఈ రెండు సినిమాల విజయాలతో టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.

అయితే ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు విజయాలను సొంతం చేసుకుంటాయనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం సులువు కాదనే చెప్పాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రం ప్రస్తుతం దేశంలోని టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ డైరెక్టర్ల తర్వాత సినిమాలకు సైతం రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

డిమాండ్ కు అనుగుణంగా ఈ స్టార్ డైరెక్టర్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చాలామంది స్టార్ హీరోలతో పోల్చి చూస్తే ఈ డైరెక్టర్ల పారితోషికం ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. ఈ డైరెక్టర్లు మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus