ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు అంతా బానే ఉంది అనుకుంటే మరుక్షణం ఎలా ఇబ్బంది పెడతామో చెప్పలేము. ఇప్పుడు ఏమి లేదు మేమేం చేయగలం అనుకుంటే.. పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన వాళ్ళను మనం చూశాం. సినీ పరిశ్రమలో అయితే ట్యాలెంట్, లక్ ఈ రెండు ఉంటేనే రాణించగలరు అనుకుంటే పొరపాటే. ట్యాలెంట్ తో పాటు హార్డ్ వర్క్ చేయగలగాలి, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలి.
లక్ ను మన వద్దకు తీసుకొచ్చేది డెస్టినీ. వీటికి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. గతంలో చిరంజీవి ఎన్నో అవకాశాలు కోసం స్టూడియోలు చుట్టూ తిరిగేవారు. ‘ఇక్కడ ఏం సాధించాలని అనుకుంటున్నావు?’ అని స్టూడియో వాళ్ళు చిరంజీవిని అడిగితే… ‘హీరో అవ్వాలి అనే లక్ష్యంతో నటుడవ్వాలనుకుంటున్నాను’ అంటూ చిరు జవాబిచ్చారు. దాంతో ‘నీ మొహానికి హీరో కూడానా.. మొహం అద్దంలో చూసుకో’ అన్నారు. కట్ చేస్తే ఆయన 4 దశాబ్దాలుగా స్టార్ హీరోగా రాణిస్తున్నారు.
రవితేజ, నాని వంటి వారు కూడా అంతే.. వాళ్ళకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు కానీ కాంట్రవర్సీలతో కాకుండా స్వయంకృషి, ట్యాలెంట్ తో స్టార్లు అయ్యారు. సరిగ్గా ఇలానే బాలీవుడ్లో ఓ రచయిత ఉంది. ఆమె పేరు షాగుప్తా రఫీక్.ఈమె జీవితంలో చాలా ట్రాజెడీ ఉంది. ఈమె తల్లిదండ్రులు ఎవరో తెలీదు. చిన్నప్పుడే ఆమెను గోడ పై వదిలేసారు. అయితే ఓ పెద్దావిడ ఈమెను చేరదీసి పెంచింది.దురదృష్టవశాత్తు ఈమె కూడా చనిపోయింది. దీంతో పదేళ్ళకే ఆమె క్లబ్ డ్యాన్సర్ గా మారిందట.
తర్వాత కొన్ని కారణాల వల్ల గత్యంతరం లేక వేశ్యగా కూడా మారాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఈమెలో రచయిత కూడా ఉందని గ్రహించింది. మొదట్లో ఆమె ట్యాలెంట్ ను ఎవ్వరూ గుర్తించలేదు. ఈమె కథలు వినడానికి కూడా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కట్ చేస్తే.. ఈమె ‘ఓ లాంహే’ ,’మర్డర్ 2′ ,’రాజ్ 3′ ,’జానత్ 2′ వంటి రైటర్ గా చేసే అవకాశాలను దక్కించుకుంది. ఇప్పుడు ఈమె సొంత కథే ఓ బయోపిక్ గా రూపొందుతుంది. మహేష్‌భట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.