టాలీవుడ్ పై సునామీ దూసుకొస్తుంది…ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా మొదటి, మూడు నాలుగు నెలల్లో బడా సినిమాలు టాలీవుడ్ పై పంజా విసిరడానికి సిద్దం అవుతున్నాయి అన్న వార్త టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో చిన్న సినిమాల విడుదల దాదాపుగా 6నెలలు ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది…అదేంటి అంటే మళ్లీ జూన్ వరకూ చిన్న సినిమాలు రావా అంటే….రాకపోవడమే మంచిది..ఎందుకంటే టాలీవుడ్ ను బడా సినిమాలు ఖాబ్జా చేస్తున్నాయి…విషయంలోకి వెళితే….రామ్ చరణ్ నటించిన ధ్రువ మూవీ నుండి మహేష్ బాబు నటిస్తున్న మురుగదాస్ మూవీ వరకూ ఎన్నో పెద్ద సినిమాలు స్క్రీన్స్ ని హిట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. అందులో ముందుగా…కొత్త సంవత్సరం ఆరంభంలోనే నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ, అలాగే మెగాస్టార్ నటించిన 150వ ఖైదీనెం.150 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
సంక్రాంతి బరిలో పందెం కొళ్లుగా నిలవడంతో…ఈ రెండు మూవీలతో జనవరి నెల పూర్తి అవుతుంది. ఇక తరువాత రెండో నెల ఫిబ్రవరి మరో సీనియర్ స్టార్ హీరో నాగార్జున కూడా ‘ఓం నమో వెంకటేశాయ’ తో రానున్నారు ఆయనకు పోటీగా విక్టరీ వెంకటేష్ గురు అవతారం ఎత్తనున్నాడు. ఇక అక్కడితో రెండో మాసం ముగుస్తూ ఉండడంతో, అసలు కధ మూడో నెల అదే…మార్చ్ లో మొదలవుతుంది..ఈ నెలలో పవర్ స్టార్ పవన్ కాటమరాయుడు రంగంలోకి దిగుతుంది….అయితే ఆ నెల అంతా పవన్ సినిమా హడావిడి ఉండగా…..ఏప్రిల్ నెలలో రెండు బడా సినిమాలు…..భారీ బడ్జెట్ సినిమాలు అయితే ప్రిన్స్-మురుగుదాస్ సినిమా, మరియు, రాజమౌళి బాహుబలి రెండు ఒకే సమయంలో వస్తున్నాయి అని సమాచారం..మరి ఈ లెక్క అంతా చూసుకుంటే ఈ నాలుగు నెలలు చిన్న సినిమాలు కాస్త దూరంగా ఉంటే బెట్టర్ లేదంటే ఓపెనింగ్స్ కూడా కష్టం అయ్యి చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడక తప్పదు…మరి ఈ భారీ రేస్ లో ఎవరు గెలుస్తారో…ఎవరు నిలుస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.