Inaya Sultana: బిగ్ బాస్ ఇది దారుణం..! మండిపడుతున్న నెటిజన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఇనయా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముందుగానే వచ్చిన లీక్స్, టాక్స్ ప్రకారం ఇనయా ఎలిమినేషన్ ని అందరూ వ్యతిరేఖిస్తున్నారు. అంతేకాదు, #RIPBB6 అనే యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. ఇనయా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ట్విట్టర్ మారుమోగిపోతోంది. ఇనయా ఎలిమినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అయితే, అసలు ఇనయా ని ఇంత అర్ధాంతరంగా ఎందుకు ఎలిమినేట్ చేశారు.

తెరవెనుక ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది. మనం అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కలు ఒక్కసారి చూసినట్లయితే, నిజానికి 14వ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీళ్లలో రేవంత్ టాప్ పొజీషన్ లో ఉండగా, ఈసారి ఇనయా సెకండ్ పొజీషన్ లోకి వచ్చింది. తర్వాత రోహిత్ ఉన్నాడు. మిగిలిన శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి ముగ్గురూ డేంజర్ లో ఉన్నారు. కానీ, శనివారం అనూహ్యంగా కీర్తిని సేఫ్ చేసింది బిగ్ బాస్ టీమ్.

అంతేకాదు, ఇనయాని ఈవారం ఎలిమినేట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. శనివారం మార్నింగ్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంతమంది ఇనయా ఫ్యాన్స్ దీనిని ఫేక్ న్యూస్ అనుకున్నారు. కానీ, కాసేపటి తర్వాత ఇనయా నిజంగానే ఎలిమినేట్ అయ్యిందని తెలిసి బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై మండిపడుతున్నారు. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో చాలాసార్లు ఇలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశారని, ఇప్పుడు టాప్ లో ఉన్న ఇనయాని ఎందుకు ఎలిమినేట్ చేసారని దుమ్మెత్తిపోతున్నారు.

అంతేకాదు, పబ్లిక్ ఓటింగ్ ప్రకారం చేశారని ప్రగల్భాలు పలికే బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్లని పిచ్చోళ్లని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజలు నిజంగానే పిచ్చోళ్లలా వాళ్లకి కనిపిస్తున్నారని, అందుకే ఇలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇనయా ఎలిమినేషన్ ట్రెండింగ్ లా మారింది. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ గా ఈసారి సీజన్ 6లో ఆరుగురుని ఉంచాడు బిగ్ బాస్. వీళ్లలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus