బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వారం నామినేషన్స్ ముగిశాయి. శ్రీహాన్ ఆల్రెడీ ఫైనల్స్ కి చేరుకున్నాడు కాబట్టి శ్రీహాన్ తప్ప మిగతా వారందరూ నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగే ఫైనల్ వీక్ కూడా ఓటింగ్ లో రేవంత్ దూసుకుపోతున్నాడు. కానీ, రేవంత్ కి గట్టి పోటీ ఇస్తూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతోంది ఇనయా. ఇనయా ఓటింగ్ చూస్తుంటే అందరూ షాక్ అయిపోతున్నారు. నిజానికి తను లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేదు. కాబట్టి ఓటింగ్ తగ్గిపోతుందని అనుకున్నారు.
కానీ, ఇనయాకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తనకి ఫస్ట్ వీక్స్ లో లేని క్రేజ్ 10వ వారం నుంచీ వచ్చింది. ముఖ్యంగా 8వ వారం సూర్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇనయా గేమ్ లో గేర్ మార్చింది. ఆ తర్వాత నామినేషన్స్ లో ఇనయాని హౌస్ మేట్స్ టార్గెట్ చేయడం, తనవల్లే సూర్య ఎలిమినేట్ అయిపోయాడని నిందించడం చేశారు. దీంతో తన క్రేజ్ పెరిగిపోయింది. అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం రేవంత్ టాప్ పొజీషన్ లోనే ఉన్నాడు.
ప్రతి వెబ్ సైట్, యూట్యూబ్ పోలింగ్స్ లో టాప్ – 1 లో దూసుకుపోతున్నాడు. అదే టైమ్ లో ఇనయా కూడా రేవంత్ కి చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇద్దరికీ కేవలం 2 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ లో తేడా ఉంది. దీంతో ఇనయా ఓటింగ్ లో దూసుకుపోతోంది. మిగతా ప్లేస్ లలో రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, ఇంకా శ్రీసత్యలు వరుసగా ఉన్నారు. అయితే, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఫినాలే వీక్ లో టాప్ 5 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెడతారని టాక్.
మరోవైపు డబుల్ ఎలిమినేషన్ పెడితే నలుగురు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. వీరిలో రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి ఇంకా శ్రీసత్యలు వరుసగా ఉండబోతున్నారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే శ్రీసత్య, ఇంకా ఆదిరెడ్డి డీప్ డేంజర్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి ఇంకా మూడురోజులు ఓటింగ్ ఉంది కాబట్టి , ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!